NRI News | శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో ఘనంగా `నవరసం` వేడుకలు జరిగాయి. అట్లాంటాలోని ఎనిమిది వేర్వేరు నృత్య అకాడమీలకు చెందిన 72 మంది శాస్త్రీయ నృత్య విద్యార్థులు, తొమ్మిది మంది వయోలిన్ విద్వాంసులు కలిసి తొమ్మిది వేర్వేరు భావోద్వేగాలతో కూడిన నృత్యరూపకం ఇచ్చారు. ఈ నృత్య రూపక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమంలో రస, నాట్య విద్యా సంస్థలు, వాటి గురువులు పాల్గొన్నారు.
సంతం, భీభత్సం – నటరాజ నాట్యాంజలి – నీలిమ గడ్డమణుగు, కరుణ – సంస్కృతి – గాయత్రి శ్రీనివాసన్,
హాస్యం – నూపురా స్కూల్ ఆఫ్ భరతనాట్యం – అనిలా హరిదాస్, అద్భుతం – నృత్య సంకల్ప – సవితా విశ్వనాథన్, వీరమ్ – దీక్షా స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ – అనుప గుహ ఠాకుర్త, రౌద్రం – భరతకళ నాట్య అకాడమీ – సుభాత్ర సుదర్శన్, శృంగారం – నాట్యవేద డ్యాన్స్ అకాడమీ – సోబియా సుదీప్, భయం – జీఏ కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ – గాయత్రి వెంకటాచలం అనే నృత్యరూపకాలు ప్రదర్శించారు.శంకర నేత్రాలయ (యూఎస్ఏ) అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి, ట్రస్టీ నీలిమ గడ్డమణుగులతో సంప్రదించిన కర్ణాటక స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో వ్యవస్థాపకురాలు జస్సోత బాలసుబ్రమణ్యం తన అకాడమీతోపాటు అట్లాంటాలోని ఎనిమిది విభిన్న శాస్త్రీయ నృత్య అకాడమీల సమన్వయంతో ఈ నెల 14న నవరస వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా హాజరైన డాక్టర్ కల్పనా రెంగరాజన్ మాట్లాడుతూ శంకర నేత్రాలయతో తనకు ఉన్న అనుబంధాన్ని, సంగీత నృత్య కచేరీపై తనకు గల అద్భుతమైన అనుభవాన్ని పంచుకున్నారు. మరో గౌరవ అతిథి పాల్ లోపేజ్, అమెరికా శంకర్ నేత్రాలయ బోర్డ్ అడ్వైజర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్, అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమళ్ల, చాప్టర్ లీడ్స్ చిన్మయ్ దాస్మోహపాత్ర, హేమంత్ వర్మ పెన్మెత్స, సుధీర్ పాత్రో, విజయ్ గార్లపాటి తదితరులు పాల్గొన్నారు.