IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదహారో సీజన్‌కు అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రతి టీమ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచుల్లో కొత్త రకం షాట్లు సాధన చేస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) మాత్రం వినూత్నంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో టెన్నిస్ రాకెట్‌తో సాధన చేస్తున్నారు. తమ జట్టు ప్రాక్టీస్ వీడియోను గుజరాత్ యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
‘టెన్నిస్, క్రికెట్ కలగలిస్తే’ అనే అర్థం వచ్చేలా దానికి క్యాప్షన్ రాసింది. ఆ వీడియోలో ఆ జట్టుకు చెందిన 21ఏళ్ల సాయి సుదర్శన్ (Sai Sudharsan) టెన్నిస్ రాకెట్ పట్టుకుని బంతుల్ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పదిహేను సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ఐపీఎల్ మరో ఆరు రోజుల్లో మొదలుకానుంది. మార్చి 31న ఆరంభ పోరులో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, బెన్‌స్టోక్స్, మొయిన్ అలీ, శివం దూబే వంటి స్టార్లతో చెన్నై బలంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీతో గుజరాత్ పటిష్టంగా ఉంది. అయతే.. తొలి మ్యాచ్‌కు విధ్వంసక ఆటగాడు డేవిడ్ మిల్లర్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటు. గత సీజన్లో ఐపీఎల్లో ఆరంగేట్రం చేసిన గుజరాత్ టైటన్స్ చరిత్ర సృష్టించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జోస్ బట్లర్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది.