IPL 2023 : క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగకు మరో ఆరు రోజులే ఉంది. ఆరంభ మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)జట్టు ప్రాక్టీస్ సెషన్లో వేగం పెంచింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. ఈ స్టార్ ప్లేయర్ భారీ షాట్లు ఆడుతున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ట్విట్టర్లో షేర్ చేసింది.
వీడియోలో స్టోక్స్ బౌలర్ తల మీదుగా భారీ సిక్సర్లు కొట్టాడు. అతడితో పాటు జట్టుతో కలిసిన మొయిన్ అలీ కూడా ప్రాక్టీస్‌లో సత్తా చాటాడు. మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni), మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు పలు షాట్లు ప్రాక్టీస్ చేశాడు.
పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్‌ను సీఎస్కే ఢీ కొట్టనుంది. దాంతో, మొదటి మ్యాచ్ గెలిచి విజయంతో టోర్నీని ప్రారంభించాలని ధోనీ సేన గట్టి పట్టుదలతో ఉంది. అందుకని ఆ జట్టు ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్నారు. ఈ సీజన్ మినీ వేలంలో విధ్వంసక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ. 18.25 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. అయితే.. అతను ఈసారి ఐపీఎల్ ఆడడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, తాను సీజన్ మొత్తం అడతానని స్టోక్స్ చెప్పడంతో చెన్నై ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు.
Ben Den 🔥 #SuperForce 🦁💛
Live Now ➡️ https://t.co/Twii0Iazaw pic.twitter.com/7uX2ctwwfT
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2023