Newzealand | వన్డేల్లో శ్రీలంకపై న్యూజిలాండ్ సంచలన విజయం.. 8ఏళ్ల రికార్డు బద్ధలు
Newzealand : టెస్టు సిరీస్‌లో శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కివీస్ వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో రికార్డు విజయం సాధించింది. ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదేళ్ల రికార్డును బ్రేక్ చేసింది.
Newzealand : టెస్టు సిరీస్‌లో శ్రీలంక(Srilanka)ను చిత్తు చేసిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కివీస్ వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో రికార్డు విజయం సాధించింది. ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదేళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 2015 జనవరి 25న శ్రీలంకను 120 పరుగుల తేడాతో బ్లాక్‌క్యాప్స్ చిత్తు చేసింది. ఇప్పటివరకు ఆ జట్టుపై ఇదే న్యూజిలాండ్‌కు భారీ విజయం.
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 274 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఆ జట్టులో రచిన్ రవీంద్ర (49) టాప్ స్కోరర్. కరుణరత్నే నాలుగు వికెట్లతో రాణించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను హెన్రీ షిప్లే(Henry Shipley), బ్లెయిర్ టిక్నర్ దెబ్బకొట్టారు. షిప్లే ఐదు వికెట్లు తీసి శ్రీలంకను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. అతను కీలకమకైన ప్రథుమ్ నిస్సింకా, చరిత అలసంక, కుశాల్ మెండిస్, దసున్ శనక, కరుణరత్నేలను ఔట్ చేశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ఏడు ఓవర్లలో 31 రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇరుజట్ల మధ్య కీలకమైన రెండో వన్డే మార్చి 28న క్రిస్ట్‌చర్చ్‌లో జరగనుంది.
ఆఖరి బంతికి అనూహ్యంగా
క్రిస్ట్‌చర్చ్(christchurch)లో జరిగిన మొదటి టెస్టులో కివీస్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి గెలుపొందింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అసమాన పోరాటంతో ఆ జట్టు శ్రీలంకపై సంచలన విజయం నమోదు చేసింది. దాంతో, కివీస్ పోరాట పటిమకు యావాత్ క్రికెట్ ప్రపంచం సలాం కొట్టింది. ఈ టెస్టును వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్-5 మ్యాచుల్లో ఒకటిగా ఐసీసీ ఈమధ్యే ప్రకటించింది. రెండో టెస్టులో విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. దాంతో, కివీస్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో గెలిచి 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
Hamilton | హమిల్టన్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు.. మాజీ రేసర్‌కు రూ.8 కోట్ల జరిమానా
European Cricket: ఫీల్డర్ త్రో.. బ్యాటర్ విలవిల.. ఆ ఫన్నీ వీడియో చూడండి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

