European Cricket: ఫీల్డర్ త్రో.. బ్యాటర్ విలవిల.. ఆ ఫన్నీ వీడియో చూడండి
European Cricket:యురోపియన్ క్రికెట్లో ఓ ఫన్నీ ఘటన జరిగింది. ఫీల్డర్ త్రో చేసిన బంతి నేరుగా బ్యాటర్ గజ్జల్లో తగిలింది. ఆ మ్యాచ్‌కు కామెంట్రీ ఇస్తున్న కామెంటేటర్లు ఆ ఘటన పట్ల తెగ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
లిస్బేన్: ఇదో గమ్మత్తు ఘటన. కామెంటేటర్లు (commentators)తెగ నవ్వేసుకున్నారు. పడీ పడీ మరీ నవ్వును ఆపుకోలేకపోయారు. పోర్చుగల్‌లో జరుగుతున్న యురోపియన్ క్రికెట్(European Cricket) లీగ్‌లో జరిగిన ఘటన నిజంగానే నవ్వులు తెప్పిస్తోంది. క్రికెట్ మ్యాచ్‌లో షాట్ కొట్టిన బ్యాటర్ ఒక రన్ తీశాడు. అయితే ఫీల్డర్ మిస్ ఫీల్డింగ్ చేయడంతో బ్యాటర్ ఆ బంతికి మూడు పరుగులు తీశాడు. క్రీజ్‌లోకి వస్తున్న సమయంలో.. ఫీల్డర్ వేసిన త్రో నేరుగా ఆ బ్యాటర్‌కు తగిలింది. ఆ బంతి బ్యాటర్ గజ్జెల భాగంలో బలంగా తగలడంతో అతను తల్లడిల్లిపోయాడు. ఇక ఆ మ్యాచ్‌కు కామెంట్రీ ఇస్తున్న కామెంటేటర్లు మాత్రం నవ్వును ఆపుకోలేకపోయారు. నవ్వీ నవ్వీ .. ఆ సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఇదే.
Timeline cleanser. Sound on for maximum dopamine injection.
— Georgie Parker (@georgieparker) March 23, 2023
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇండియన్ రాయల్స్(Indian Royals) జట్టు తరపున బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ ఎండీ షైకత్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో బ్రదర్స్ లెవన్ చేతుల్లో ఇండియన్ రాయల్స్ జట్టు ఓటమిపాలైంది. గోల్డెన్ బాల్ రూల్ ప్రకారం ఈ మ్యాచ్ ఫలితం తేలింది. షైకత్(Shaikat) గజ్జల్లో బంతి తగలడం.. అందరిలో నవ్వు తెప్పించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

