Zahir Khan | టీమిండియాను హెచ్చరించిన జహీర్ ఖాన్..!
Zahir Khan | శ్రేయాస్ అయ్యర్‌తో సహా పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు వన్డేల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి 2019 వన్డే ప్రపంచకప్ నాటికి వచ్చిందని వ్యాఖ్యానించాడు.
Zahir Khan | శ్రేయాస్ అయ్యర్‌తో సహా పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు వన్డేల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి 2019 వన్డే ప్రపంచకప్ నాటికి వచ్చిందని వ్యాఖ్యానించాడు. నాలుగేళ్ల క్రితం కూడా నాలుగో నంబర్ స్థానానికి శాశ్వత బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా నానా తంటాలు పడిందని, 2019 ప్రపంచ కప్ టోర్నమెంట్లో జట్టు సెమీ ఫైనల్‌ను దాటలేకపోవడానికి ఇది ఓ కారణమని అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరుగనున్నది. ఈ క్రమంలో టోర్నీకి ఆథిత్యం ఇవ్వనున్న భారత్ ఇప్పుడు నాలుగోస్థానంపై పునరాలోచన చేయాలని సూచించాడు.
సూర్యకుమార్ భారీ ఆశలు..
సూర్యకుమార్ యాదవ్‌పై టీమిండియా భారీగానే ఆశలు పెట్టుకున్నది. జట్టులో నెంబర్ ఫోర్లో వచ్చే శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో సూర్యకుమార్ అవకాశం వచ్చింది. అయితే, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో దారుణం విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో వరుసగా మూడు గోల్డెన్ డక్‌లు సాధించాడు. దీంతో నాలుగో స్థానం బ్యాటింగ్ విషయంలో మరోసారి టీమిండియాకు తలనొప్పిగా మారింది. శ్రేయాస్ గాయపడగా.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో మరో ఆడగాడిని ఎంపిక చేయాల్సి ఉంది.
జహీర్ ఏమన్నాడంటే..?
బ్యాటింగ్ ఆర్డర్‌పై జట్టు మేనేజ్మెంట్ ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిన విషయమన్నాడు. 2019 ప్రపంచకప్‌లోనూ ఇదే అంశం చర్చనీయాంశమైందని చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నామని, ప్రస్తుతం అదే పడవలో ఉన్నామన్నాడు. శ్రేయాస్ అయ్యర్ రెగ్యులర్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్. ఆ స్థానంలో శ్రేయాస్ బాధ్యతలు చూస్తున్నాడు. ఎక్కువ రోజులు గాయం కారణంగా కోలుకోలేని పరిస్థితి ఉంటే.. ఇందుకు సమాధానం వెతకాలి. పేలవమైన ప్రదర్శన ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో ఓటమి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో సూర్యకుమార్‌కు మద్దతు తెలిపాడు. సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో మూడు బంతులు మాత్రమే ఆడాడని, నిజం చెప్పాలంటే మూడు మంచి బంతులని చెప్పాడు. స్పిన్‌ను బాగా ఆడగలడని, ఏళ్లుగా చూస్తూ వస్తున్నామన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
బాలికల పట్ల పారిశుధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన?
Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

