IPL 2025 : వరుస విజయాలతో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మరోసారి భారీ స్కోర్ కొట్టింది. శుభ్‌మన్ గిల్(84)కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. జోస్ బట్లర్(50 నాటౌట్) తన విధ్వంసాన్ని కొనసాగించి అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్(13) ధనాధన్ ఆడగా.. ఆర్చర్ వేసిన 20వ ఓవర్లో రాహుల్ తెవాటియా(9) సిక్సర్ బాదడంతో గుజరాత్ స్కోర్ 200 దాటింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి బట్లర్ రెండు పరుగులు తీయగా గిల్ బృందం నిర్ణీత ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ విజయంతో పరువు కాపాడుకుంటుందా? గుజరాత్ బౌలర్లకు దాసోహం అవుతుందా? అనేది చూడాలి.
జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు తేలిపోయారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు చెలరేగగా భారీగా పరుగులిచ్చారు. టాస్ ఓడిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(84), సాయి సుదర్శన్(39) ఎప్పటిలానే శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు. దాంతో, గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసింది.
Glorious Gill 🤌
Two fabulous strikes from the #GT captain as he makes strides towards his season’s first 1⃣0⃣0⃣ 🔥
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @gujarat_titans | @ShubmanGill pic.twitter.com/EgnQQFXlSX
— IndianPremierLeague (@IPL) April 28, 2025
6వ ఓవర్ తర్వాత జోరు పెంచిన గిల్ హసరంగ ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో సుదర్శన్ సైతం దంచేయగసాగాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఎట్టకేలకు థీక్షణ విడదీశాడు. అతడి బౌలింగ్‌లో సుదర్శన్ పెద్ద షాట్ ఆడబోగా.. రియాన్ పరాగ్ క్యాచ్ సూపర్‌గా అందుకున్నాడు. దాంతో, 93 వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది.
Turning back the clock in Jaipur ⏰ 👏
Jos Buttler scores a 26-ball 5⃣0⃣* to power #GT‘s finish 💪
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @gujarat_titans | @josbuttler pic.twitter.com/e4mR7jUhKz
— IndianPremierLeague (@IPL) April 28, 2025
సుదర్శన్ ఔటయ్యాక జోస్ బట్లర్(50 నాటౌట్) జతగా గిల్ వీరవిహారం చేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నఅతడిని థీక్షణ ఔట్ చేసి రాజస్థాన్‌కు బ్రేకిచ్చాడు. కానీ, ఆ తర్వాత బట్లర్ బాదుడు షురూ చేశాడు. స్వీప్ షాట్లతో అలరిస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించిన బట్లర్ ఆఖరి ఓవర్లో డబుల్స్ తీసి 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో అతడికిది నాలుగో ఫిఫ్టీ. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(13) రాణించాడు. దాంతో, ప్రత్యర్థికి 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది గిల్ బృందం.