చండూరు, ఏప్రిల్ 28 : ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని నిరుపేదలకే ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేర్మట గ్రామంలోఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, నారపాక శంకర్, ఈరగట్ల నరసింహ, నారపాక నరసింహ, శంకర్, మల్లయ్య, బొమ్మగోని యాదయ్య, శ్రీహరి, యాదయ్య, రమేశ్, నారపాక అండాలు, మనోహర్, లింగమ్మ, ముత్తమ్మ, లక్ష్మమ్మ, సోనగోని లక్ష్మమ్మ, సరిత, నారపాక యాదమ్మ, మల్లమ్మ పాల్గొన్నారు.