న్యూఢిల్లీ: హల్దీ వేడుకకు వచ్చిన వరుడితోపాటు అతిథులకు వధువు షాక్ ఇచ్చింది. పెద్ద డైనోసోర్ కాస్ట్యూమ్‌లో ఆమె ఎంట్రీ ఇచ్చింది. (Bride Attends In Dinosaur Costume) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా ప్రత్యేకంగా జరుపుకునే పెళ్లి వేడుకల్లో వధూవరులు వినూత్నంగా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకలో పెళ్లికూతురు అందరినీ ఆశ్చర్యపరిచింది. పెద్ద డైనోసోర్ కాస్ట్యూమ్‌లో అక్కడకు చేరుకున్నది. అక్కడున్న వారిని ఆమె పలుకరించింది.
కాగా, ఇది చూసి వరుడితోపాటు హల్దీ వేడుకకు వచ్చిన వారు షాక్ అయ్యారు. ఆ తర్వాత డైనోసార్ కాస్ట్యూమ్‌లో ఉన్న వధువుతో వరుడు డ్యాన్స్ చేశాడు. అనంతరం ఆమె ఆ కాస్ట్యూమ్ నుంచి బయటకు వచ్చింది.
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. పెళ్లికూతుర్ని ‘బ్రైడోసోర్’గా కొందరు అభివర్ణించారు. అలాగే మరికొందరు ఆ వధువును గాడ్జిల్లా కాదు ‘బ్రైడ్జిల్లా’ అని కామెంట్ చేశారు.
View this post on Instagram
A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)