Franz Beckenbauer : ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో విషాదం నెలకొంది. జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్బౌర్ (Franz Beckenbauer) కన్నుమూశాడు. రెండుసార్లు ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) చాంపియన్ అయిన ఫ్రాంజ్ 78 ఏండ్ల వయసులో నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ విషాద వార్త చెవినపడంగానే అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
వెస్ట్ జర్మనీ కెప్టెన్‌గా 1974లో వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న ఫ్రాంజ్.. 1990లో కోచ్‌గా ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాడు. అంతేకాదు 1972లో ప్రతిష్ఠాత్మకమైన యూరో చాంపియన్‌షిప్ ట్రోఫీ విజేతగా నిలిచాడు. జర్మనీ లీగ్‌లో ఐదుసార్లు టైటిళ్లు కొల్లగొట్టిన ఘనత ఫ్రాంజ్ సొంతం.
వరల్డ్ కప్ ట్రోఫీతో ఫ్రాంజ్ బెకెన్బౌర్
ఫ్రాంజ్ వెస్ట్ జర్మనీ తరఫున 104 మ్యాచ్‌లు, బేర్న్ మ్యునిచ్ తరఫున 400లకు పైగా మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్ ఆసాంతం ఆయన 582 మ్యాచ్‌లు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత కోచ్ అవతారమెత్తిన ఫ్రాంజ్ తన ముద్ర వేశాడు. కోచ్‌గా అనుభవం లేకపోయినా వెస్ట్ జర్మనీని వరుసగా రెండు పర్యాయాలు(1986, 1990) ఫైనల్స్‌కు చేర్చాడు.
మరియో జగల్లో
దాంతో ఫుట్‌బాల్ చరిత్రలోనే ఆటగాడు, కోచ్‌గా వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన రెండో వ్యక్తిగా ఫ్రాంజ్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు బ్రెజిల్ లెజెండ్ మరియో జగల్లో(Mario Zagallo).. ప్లేయర్, మేనేజర్‌గా ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే..? రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరూ కన్నుమూశారు.