Gautam Gambhir | ఢిల్లీ: టీమ్ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా జట్టును నడిపించడం తమకు పెద్ద సవాలేనని భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గంభీర్ అన్నాడు. వారం రోజుల వ్యవధిలో రోకో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వారిపై గంభీర్ తొలిసారిగా స్పందించాడు. గౌతీ మాట్లాడుతూ.. ‘ఆటను ఎప్పుడు ఆరంభించాలి? ఎప్పుడు ముగించాలి?
అనేది క్రీడాకారుల వ్యక్తిగత విషయం. అందులో ఒక సెలెక్టర్ గానీ, కోచ్ గానీ, ఎవరు గానీ వారిని రిటైర్ అవమని కోరే హక్కు ఉండదు. ఆ ఇద్దరూ జట్టులో చాలా అనుభవమున్న ఆటగాళ్లు. రోహిత్, కోహ్లీ లేకపోవడం మాకు పెద్ద లోటే.. కానీ ఇదే సమయంలో ఇతరులు నిరూపించుకోవడానికిఅవకాశం’ అని అన్నాడు.