CAB President : టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ సోదరుడు స్నేహశిష్ గంగూలీ (Snehasish Ganguly) ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) అధ్యక్షు డిగా కొనసాగుతున్న ఆయన పూరీలో జరిగిన బోటు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగిందని క్యాబ్ తెలిపింది. అసలు ఏం జరిగిదంటే..? భార్య అర్పితతో కలిసి పూరీ బీచ్లో మే 24 శనివారం పడవ షికారుకు వెళ్లాడు గంగూలీ.
కాసేపటికే వాళ్లు ప్రయాణిస్తున్న పడవ అనుకోకుండా ప్రమాదానికి గురైంది. బోటు రివర్స్ కావడంతో, వాళ్లు భయంతో అరవడం మొదలు పెట్టారు. పడవ మునిపోతుండడం గమనించిన జాలరులు, స్థానికులు పరుగున వెళ్లి గంగూలీ, ఆయన భార్యను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆతర్వాత వైద్య పరీక్షలు అనంతరం.. ఆరోగ్యం బాగానే ఉందని తెలియడంతో ఇరువురు కోల్కతా చేరుకున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని క్యాబ్ వెల్లడించింది.
VIDEO | Puri, Odisha: Cricket Association of Bengal (CAB) President and brother of former Indian cricket team captain Sourav Ganguly, Snehasish Ganguly, and his wife Arpita Ganguly were safely rescued after they encountered a horror as their speedboat capsized off Puri coast.… pic.twitter.com/rWCOB4bgYm
— Press Trust of India (@PTI_News) May 26, 2025
‘ఆ పడవ ప్రమాదాన్ని తలచుకుంటేనే నాకు భయమేస్తోంది. అది నిజంగా పెద్ద ప్రమాదం. మేము చనిపోతామని అనుకున్నా. అయితే.. మా అరుపులు విన్న జాలరులు, స్థానికులు పరుగున వచ్చి మమ్మల్ని కాపాడారు. ఈ సందర్భంగా జగన్నాథుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది మాకు నిజంగా పునర్జన్మ’ అని గంగూలీ తెలిపాడు.
సోదరుడితో గంగూలీ
తన సోదరుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో దాదా సైతం భగవంతుడికి ధన్యవాదాలు తెలిపాడు. తన సోదరుడు, అతడి భార్య పడవ ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలిసిన దాదా కంగారు పడిపోయాడు. స్థానికుల సాయంతో వాళ్లిద్దరు క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరిపీల్చుకున్నాడు గంగూలీ. బెంగాల్ మాజీ క్రికెటర్ అయిన స్నేహశిష్ అన్న గంగూలీ బాటలోనే పయనిస్తూ.. క్యాబ్ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.