iQOO Neo 10 | ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు తమ మిడ్ రేంజ్ ఫోన్లనే ఫ్లాగ్ షిప్ ఫోన్ల రేంజ్లో రూపొందించి విడుదల చేస్తున్నాయి. దీంతో అలాంటి ఫోన్లకు డిమాండ్ సైతం అధికంగానే ఉంది. అందులో భాగంగానే ఈ తరహా ఫోన్లను తయారు చేసి అందించేందుకు కంపెనీలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇక ఇదే కోవలో తాజాగా ఐక్యూ కూడా ఓ నూతన మిడ్ రేంజ్ కమ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఐక్యూ నియో 10 పేరిట భారత మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.78 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1.5కె రిజల్యూషన్, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. డిస్ప్లేపై అద్భుతమైన దృశ్యాలన వీక్షించవచ్చు. సూర్య కాంతిలోనూ ఫోన్ తెర సరిగ్గా కనిపించేందుకు గాను ఈ ఫోన్లో 5500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఐక్యూ నియో10 స్మార్ట్ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ పనితనం బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్ ఆన్షన్లు ఉన్నాయి. 128 లేదా 256, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్లో వీసీ లిక్విడ్ కూలింగ్ అనే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను ఎంత ఎక్కువ సేపు వాడినా కూడా హీట్‌కు గురికాకుండా ఉంటుంది. ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా ఈ కెమెరాలు అన్నింటితోనూ స్పష్టమైన 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.
ఈ ఫోన్లో ఐపీ 65 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఫన్ టచ్ ఓఎస్15ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గాను 3 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్ లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి గాను 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ చార్జింగ్ 0 నుంచి 50 శాతం వరకు పూర్తయ్యేందుకు కేవలం 19 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. 0 నుంచి 100 శాతం చార్జింగ్ చేసేందుకు 36 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్‌కు గాను ఫ్లాష్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు.
ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్లో రెండు సిమ్ లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ లను ఏర్పాటు చేశారు. యూఎస్బీ టైప్ సిని ఇందులో అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ఇన్ఫెర్నో రెడ్, రెడ్ అండ్ టైటానియం క్రోమ్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.31,999గా నిర్ణయించారు. అదే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ అయితే రూ.33,999కు లభిస్తుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.35,999 ధరకు, 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ఫోన్‌ను రూ.40,999 ధరకు అందిస్తున్నారు.
ఈఫోన్ను జూన్ 2 నుంచి విక్రయించనున్నారు. అమెజాన్‌తోపాటు ఐక్యూ ఆన్లైన్ స్టోర్ లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనికి గాను ప్రీ బుకింగ్స్‌ను కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఈ ఫోన్‌ను ఎస్బీఐ కార్డులతో కొంటే రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఇతర వివో లేదా ఐక్యూ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.2000 నుంచి రూ.4000 వరకు అదనంగా బోనస్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌పై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను ప్రీబుకింగ్ చేసుకునే వారికి ఐక్యూ టీడబ్ల్యూ 1ఇ ఇయర్ బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు.