Get together | చేవెళ్ల రూరల్, మే 26 : దాదాపు 21 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ కలుసుకున్నారు. 2003-04 సంవత్సరంలో శంకర్పల్లి మండల పరిధి దోబీపేట్ (మహాలింగపురం) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ చేసుకున్నారు.
దోబీపేట్ గ్రామ సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అందరూ సరదాగా గడిపారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు జ్ఞాపికలు అందజేసి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.