Ranji Trophy | మహబూబ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 17: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గణేశ్..రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రాజశేఖర్ శనివారం పేర్కొన్నాడు. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ ప్లేట్ డివిజన్ ఫైనల్లో హైదరాబాద్ తరఫున గణేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
గత సీజన్లో మహబూబ్‌నగర్ జిల్లాకు ఆడిన గణేశ్ (137, 73, 49, 91) మొత్తంగా 350 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పటి వరకు పాలమూరు నుంచి గౌస్‌బాబా ఒక్కడే ఎంపిక కాగా, 25 ఏండ్ల తర్వాత గణేశ్‌కు చోటు దక్కింది. హెచ్‌సీఏ టోర్నీలో ట్రిపుల్, డబుల్ సెంచరీలు చేసిన ఘనత ఇక్కడికి దక్కింది. రంజీ జట్టుకు ఎంపికపై ఎండీసీఏ కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేశ్, అశోక్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, కృష్ణమూర్తి అభినందించారు.