Ruturaj Gakiwad : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gakiwad) అక్కడే మరికొన్ని రోజులు ఉండనున్నాడు. భారత సీనియర్ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ అనంతరం ఈ యంగ్‌స్టర్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం భారత ‘ఏ’ జట్టు స్క్వాడ్‌లో ఉన్న గైక్వాడ్ త్వరలోనే యార్క్‌షైర్ (Yorkshire) జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని సదరు టీమ్ మంగళవారం ధ్రువీకరించింది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రుతురాజ్ 5 మ్యాచ్‌లు ఆడుతాడు. అనంతరం వన్డే కప్‌లోనూ పాల్గొంటాడీ యువ క్రికెటర్.
‘ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి, రంజీల్లో మహారాష్ట్రకు కెప్టెన్. పుణేకు చెందిన గైక్వాడ్ అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన క్రికెటర్. ఆరు వన్డేలు, 23 టీ20లు ఆడిన అనుభవం అతడికి ఉంది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన గైక్వాడ్ ఏ స్థానంలోనైనా ఆడగల సమర్ధుడు. ఓపెనింగ్ నుంచి నాలుగో స్థానంలో దంచికొట్టగలడు’ అని యార్క్‌షైర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గైక్వాడ్ సైతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాని తెలిపాడు.
YCCC is delighted to announce the overseas signing of Ruturaj Gaikwad 🤩
He will join up with the Yorkshire squad ahead of the @CountyChamp game vs Surrey at Scarborough & will stay with the White Rose until the end of the season
Read more➡️ https://t.co/SMg3JmRuux pic.twitter.com/1AGeSgG4tQ
— Yorkshire CCC (@YorkshireCCC) June 10, 2025
‘ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడడం ఎల్లప్పుడూ గొప్ప ఫీలింగ్. ఆ దేశంలో యార్క్‌షైర్ కంటే పెద్దదైన క్రికెట్ క్లబ్ మరొకటి లేదు. ఈ సీజన్లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఈ సీజన్లో మేము కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో పాటు వన్డే కప్‌లో కఠినమైన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తుంది. ట్రోఫీ గెలవడం మీదనే దృష్టి సారిస్తున్నాం’ అని వెల్లడించాడీ యంగ్‌స్టర్. జూన్ 13 నుంచి 16 మధ్య భారత సీనియర్ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ ఆడతాడు గైక్వాడ్. అనంతరం అతడు కౌంటీ ఛాంపియన్షిప్ కోసం యార్క్‌షైర్ జట్టులో భాగమవుతాడు.
ఐపీఎల్ 18వ సీజన్లో గాయపడిన రుతురాజ్ అనూహ్యంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. బొటనవేలి గాయం నుంచి కోలుకున్న అతడు ఈమధ్యే ఫిట్నెస్ సాధించాడు. దాంతో, భారత ఏ జట్టుతో ఇంగ్లండ్ పర్యటనకు అతడిని ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఐపీఎల్ నుంచి గైక్వాడ్ వైదొలిగిన అనంతరం మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పగ్గాలు అందుకున్నాడు ధోనీ. అయితే.. అప్పటికే సీఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలు అడుగంటాయి. అయినా సరే.. తన ప్రయత్నం చేసిన మహీ భాయ్ విజయంతో 18వ సీజన్‌కు వీడ్కోలు పలికాడు.