Kamal Hassan | లోకనాయకుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నడ భాషని కాస్త తక్కువ చేసి మాట్లాడాడు. ఆయన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో కోర్ట్ కూడా క్షమాపణలు చెప్పాలని సూచించింది. ఎంత పెద్ద యాక్టర్ అయినప్పటికీ ఏ పౌరుడి మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని హెచ్చరించింది. అలానే కమల్ వ్యాఖ్యలకు ఆధారాలు ఏంటని ప్రశ్నించిన నాయస్థానం.. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది.కాని కమల్ క్షమాపణలు చెప్పనని మొండిపట్టు పట్టడంతో, ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) బ్యాన్ చేసింది. దీంతో కర్ణాటకలో ఎక్కడ కూడా థగ్ లైఫ్ విడుదల కాలేదు.
థగ్ లైఫ్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కమల్ ఒక్క కర్ణాకలో తప్ప అంతటా విడుదల చేశాడు. అయితే తొలి షో తోనే థగ్ లైఫ్ తేలిపోయింది. ‘నాయకుడు’ తర్వాత మణిరత్నం నుండి మరో నాయకుడు లాంటి గొప్ప చిత్రం వస్తుందనుకుంటే? తెరపై రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాను చూపించి ప్రేక్షకులకి విసుగు తెప్పించాడు. ఈ సినిమా ఆదివారం వసూళ్లతో కలిపి నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా 40 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నాలుగు రోజుల్లో 73 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. కనీసం కమల్ గత చిత్రం ఇండియన్ 2 వసూళ్లని కూడా ఈ చిత్రం రీచ్ కాలేదు. ఇండియన్ 2 ఫ్లాప్ అయిన కనీసం నాలుగు రోజుల్లో 110 కోట్ల వసూళ్లను సాధించింది.
కమల్ హాసన్ క్షమాపణ చెప్పి కర్ణాటకలో సినిమా విడుదలై ఉండి ఉంటే థగ్ లైఫ్ చిత్రం ఇండియన్ 2 వసూళ్ల దగ్గరకైన చేరేది. కమల్ క్షమాపణ చెప్పకపోవడం వలన 30 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. కమల్ హాసన్‌ని కర్ణాటలోను మంచి ఫాలోయింగ్ ఉంటుంది. పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ వస్తాయి. థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ అయి ఉంటే భారీగానే ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. కారణం ఏదైనా కమల్ క్షమాపణ చెప్పకపోవడం అన్నది 30 కోట్ల మేర నష్టం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ -మణిరత్నం కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే.