IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు పెద్ద షాక్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) అనూహ్యంగా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడు సీజన్ మొత్తానికి దూరం కానున్నందున ఎంఎస్ ధోనీ(MD Dhoni) చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
అనుభవజ్ఞుడైన మహీ భాయ్ సారథ్యంలో సీఎస్కే తర్వాతి పోరులో బరిలోకి దిగనుంది. మోచేతి గాయం (Elbow Injury)తో బాధ పడుతున్న కెప్టెన్ రుతురాజ్ 18వ సీజన్ నుంచి వైదొలుగుతున్నట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. సీఎస్కే యాజమాన్యం ఎక్స్ పోస్ట్ ద్వారా ధ్రువీకరించింది.
🚨 OFFICIAL STATEMENT 🚨
Ruturaj Gaikwad ruled out of the season due to a hairline fracture of the elbow.
MS DHONI TO LEAD. 🦁
GET WELL SOON, RUTU ! ✨ 💛#WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/U0NsVhKlny
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025
ధోనీ వారసుడిగా సీఎస్కే పగ్గాలు చేపట్టిన రుతురాజ్ 17వ సీజన్లో ఆకట్టుకున్నాడు. బ్యాటుతో దంచేస్తూ.. తాలా విలువైన సలహాలు, సూచనలతో జట్టును నడిపించాడు గైక్వాడ్. అయితే..18వ సీజన్ల్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)లో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా బంతి అతడి ఎడమ మోచేతికి బలంగా తాకింది. దాంతో, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో గైక్వాడ్ ఆడడం సందేహం అనిపించింది. ఆ మ్యాచ్‌కు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడనే వార్తలు వినిపించాయి. కానీ, గైక్వాడ్ జట్టుతో కలిసి మైదానంలోకి దిగాడు. అయితే.. ఢిల్లీపై స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. మోచేతి నొప్పిగా ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి మోచేతి ఎముకలో చిన్న పగుళ్లను గుర్తించారు. విశ్రాంతి అవసరమని సూచించారు డాక్టర్లు. దాంతో, గైక్వాడ్ సీజన్ మొత్తానికి దూరం అవ్వాల్సి వచ్చింది.
CAPTAIN MAHENDRA SINGH DHONI 🦁7️⃣#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/H3Wqm6AdGt
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025
పద్దెనిమిదో సీజన్లో చెన్నై ఆటలో ఫైర్ తగ్గింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలం అవతున్నా.. రుతురాజ్ మాత్రం అదరగొట్టాడు. 5 మ్యాచుల్లో 122 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాపార్డర్‌లో కీలకమైన గైక్వాడ్ సీజన్ మొత్తానికికు దూరమవ్వడం సీఎస్కేకు పెద్ద లోటే అని చెప్పాలి. ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే.. ముంబైపై విజయం మినహాయిస్తే అన్నింటా సమిష్టి వైఫల్యంతో మ్యాచ్ చేజార్చుకుంది. 180 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడుతోంది. ఈ ఎడిషన్‌లో దారుణంగా ఆడుతున్న చెన్నై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో తలపడనుంది.