Ira Jadav | భారత అండర్-19లో సరికొత్త రికార్డు నమోదైంది. 14 సంవత్సరాల ముంబయి బ్యాట్స్ వుమెన్ ఇరా జాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ట్రిపుల్ సెంచరీ సాధించింది. బెంగళూరు వేదికగా ముంబయి-మేఘాలయ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరా జాదవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో.. బౌలర్లను ఊచకోత కోసింది. యువ సంచలనం కేవలం 157 బంతుల్లో 346 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఇరా 16 సిక్సర్లు, 42 ఫోర్ల సహాయంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించింది. వైట్ బాల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళా బ్యాటర్‌గా ఇరా జాదవ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇదే అండర్-19 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ వుమెన్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్లే లీ పేరిట ఉన్నది. 2020లో కీపై అజేయంగా 427 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఇరా జాదవ్ అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచింది.
మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఇరా జాదవ్‌తో కలిసి కెప్టెర్ హర్లీ గాలాతో కలిసి 79 బంతుల్లో 116 పరుగులు చేసింది. ఇద్దరు కలిసి రెండో వికెట్ 274 పరుగులు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో 71 బంతుల్లో జాదవ్ 149 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత దీక్షా పవార్‌తో కలిసి 186 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరి పార్టనర్‌షిప్‌లో 50 బంతుల్లో 137 పరుగులు చేసింది. మేఘాలయ ముగ్గురు బౌలర్లలో వంద.. అంతకంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబయి మొత్తం 536 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ కేవలం 19 పరుగులకే కుప్పకూలింది. మేఘాలయ ఇన్నింగ్స్‌లో ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఇందులో అదనంగా వచ్చిన పరుగులే 10 ఉన్నాయి. ఎక్స్‌ట్రాలు మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలువడం విశేషం. ముంబయి బౌలర్లలో జియా, యయాతి మూడు వికెట్ల చొప్పున, రితికా, అక్షయ తలో రెండు వికెట్లు తీశారు. ఇక ఇరా జాదవ్ శారదాశ్రమ విద్యామందిర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని. ఇక్కడ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లితో పాటు అజిత్ అగార్కర్ ఇక్కడే చదువుకున్నారు.