నాటింగ్‌హామ్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమమైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో మ్యాచ్‌లో కివీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 17.2 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఇంగ్లిష్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ కివీస్ బ్యాటర్లు టిమ్ సిఫర్ట్ (48), గ్లెన్ ఫిలిప్స్(42), మార్క్ చాప్మన్ (40 నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఓపెనర్ అలెన్(16) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా..వీరు జట్టును విజయతీరాలకు చేర్చారు. రేహాన్ అహ్మద్ (2/27) రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 175/8 స్కోరు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(73) అర్ధసెంచరీతో రాణించగా, మలన్( 26), లివింగ్‌స్టోన్ (26) ఫర్వాలేదనిపించారు. సాంట్నర్ (3/30), ఇష్ సోధీ (2/21) రాణించారు. సాంట్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, బెయిర్‌స్టోకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ నెల 8నుంచి మొదలుకానుంది.