ODI WC 2023 : వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్(T20 Series)లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) రెచ్చిపోయి ఆడుతున్నాడు. అరంగేట్రం సిరీస్‌లోనూ అద్భుత బ్యాటింగ్‌తో ఔరా అనిపిస్తున్నాడు. దాంతో, ఈసారి వరల్డ్ కప్(ODI World Cup 2023) జట్టుకు అతడిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నవాళ్ల సంఖ్య పెరుగతోంది. తాజాగా టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ జట్టులో తిలక్ వర్మను తీసుకోవాలని, అతడు జట్టుకు వైవిధ్యాన్ని తీసుకొస్తాడని అన్నాడు.
‘టాపార్డర్‌లో ఈ లెఫ్ట్ హ్యాండర్ చక్కగా సరిపోతాడు. చాలా కొద్దిమంది మాత్రమే విభిన్నమైన పరిస్థితులకు అలవాటు పడతారు. వాళ్లలో తిలక్ వర్మ ఒకడు. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఫిట్‌గా లేకుంటే అతడి స్థానంలో తిలక్‌కు ఆడించాలి. ఎందుకంటే..? ఈ తెలుగు కుర్రాడు ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొంటాడు. అంతేకాదు అవసరాన్ని బట్టి గేర్ మార్చి విరుచుకుపడగల నైపుణ్యం అతడి సొంతం. ఏ రకంగా చూసినా తిలక్ వరల్డ్ కప్‌లో ఆడేందుకు అన్ని విధాలా అర్హుడు’ అని ప్రసాద్ వెల్లడించాడు.
తిలక్ వర్మ
అంతేకాదు తిలక్ స్ట్రయిక్ రొటేట్ చేసే విధానం గమినిస్తే తనకు ఆస్ట్రేలియా లెజెండ్ మైఖేల్ బెవాన్ (Michael Bevan) గుర్తుకొస్తున్నాడని ప్రసాద్ అన్నాడు. ‘తిలక్ పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకుంటాడు. చకచకా స్ట్రయిక్ రొటేట్ చేస్తాడు. దాంతో, అతడిని పరుగులు చేయకుండా ఆపడం కష్టం. అతడి ఆట మైఖేల్ బెవాన్‌ను పోలి ఉంటుంది. పైగా దేశవాళీ క్రికెట్లో తిలక్ వర్మ సగటు 55 ఉంది. అందుకని అతను వరల్డ్ కప్ జట్టు ఎంపికలో మిగతావాళ్లకంటే బెస్ట్ చాయిస్ అవుతాడు’ అని ఎమ్మెస్కె చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో రాణించిన తిలక్ వర్మ జాతీయ జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసిన ఈ యంగ్‌స్టర్ దంచి కొడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో 39, రెండో మ్యాచ్‌లో (51) అర్ధ సెంచరీతో మెరిశాడు. కీలకమైన మూడో మ్యాచ్‌లో 49 నాటౌట్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దాంతో, ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ తొలి విజయం నమోదు చేసింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 ఆగస్టు 12 జరుగనుంది.