Trent Boult | ఇప్పటికీ అదే ఆకలితో ఉన్నా.. వరల్డ్ కప్‌లో సత్తా చాటుతా : న్యూజిలాండ్ స్టార్ పేసర్
Trent Boult : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) పోటీలకు సమయం దగ్గర పడుతోంది. ఈ మెగా టోర్నీకి సన్నద్ధతలో భాగంగా అన్ని జట్లు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో న్యూజిలాండ్ (Newzealand) స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటికి అదే ఆకలితో ఉన్నానని, జాతీయ జట్టుకోసం ఏదైనా చేయాలని...
Trent Boult : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) పోటీలకు సమయం దగ్గర పడుతోంది. ఈ మెగా టోర్నీకి సన్నద్ధతలో భాగంగా అన్ని జట్లు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో న్యూజిలాండ్ (Newzealand) స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటికి అదే ఆకలితో ఉన్నానని, జాతీయ జట్టుకోసం ఏదైనా చేయాలని ఉందని అన్నాడు. వరల్డ్ కప్ ఆడే అవకాశం వస్తే సత్తా చాటుతానని ఈ స్పీడ్‌స్టర్ తెలిపాడు.
‘మళ్లీ జట్టులోకి రావాలని ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నా. వరల్డ్ కప్ చరిత్ర, గతంలో మాకు ఎదురైన అనుభవాలు మరింత ప్రేరణ కలిగిస్తున్నాయి. మునుపటిలాగానే వరల్డ్ కప్‌లో చెలరేగాలనే ఆకలితో ఉన్నా. నాలుగేళ్ల క్రితం మేము తృటిలో చేజార్చుకున్న ట్రోఫీని ముద్దాడాలనే ఆలోచనతో ఉన్నా’ అని బౌల్ట్ తెలిపాడు. 2019 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన బోల్ట్ ఈసారి కూడా అదే మ్యాజిక్ చేయాలనుకుంటున్నాడు.
కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్

ఈ 34 ఏళ్ల స్పీడ్ గన్.. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న విషయం తెలిసిందే. అయితే.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న అతను ఈమధ్యే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(England ODI Series)కు ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ ముందు కివీస్ ఆడబోయే చివరి టోర్నీ ఇది. అతడి రాకతో న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న కేన్ విలియమ్సన్ (Kane Williamson) కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. అయితే.. ప్రపంచ కప్‌లోపు అతను ఫిట్నెస్ సాధిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విలియమ్సన్ కూడా జట్టుతో కలిస్తే కివీస్ బ్యాటింగ్ యూనిట్ స్ట్రాంగ్ అవుతుంది.
2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత టాపార్డర్‌ను కూల్చిన బౌల్ట్

కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ 2019 వరల్డ్ కప్‌లో అద్భుత ఆటతో ఫైనల్ చేరింది. సెమీస్‌లో బలమైన టీమిండియాను ఓడించి ఇంగ్లండ్‌తో టైటిల్ పోరులో తలపడింది. అయితే.. అనూహ్యంగా సూపర్ ఓవర్(Super Over)లో బ్లాక్ క్యాప్స్‌ను దురదృష్టం వెంటాడింది. దాంతో, ఇంగ్లండ్ జట్టు మొదటిసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ ఏడాది వరల్డ్ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5న మొదలు కానున్న ఈ మెగా టోర్నీ ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ కొననున్నాయి.
ఇవి కూడా చదవండి
ODI WC 2023 | వరల్డ్ కప్ స్టేడియం డ్రెస్సింగ్ రూమ్‌లో మంటలు.. కారణం అదే..!
India Vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ టికెట్లు అమ్మేది ఏ రోజంటే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

