Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్‌కు ముందు భారత హాకీ జట్టుకు పెద్ద షాక్. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్(Amit Rohidas)పై నిషేధాన్ని సవాల్ చేస్తూ హాకీ ఇండియా(Hockey India) చేసిన అప్పీల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) కొట్టేసింది.
‘ఆగస్టు 4న బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రోహిదాస్ ఎఫ్ఐహెచ్ నియమ నిబంధలను ఉల్లంఘించాడు. ఆ మ్యాచ్‌లో రోహిదాస్ తీరును గమనించాక హాకీ ఇండియా అప్పీల్‌ను తిరస్కరించాం. అతడు సెమీ ఫైనల్లో ఆడడు’ అని ఎఫ్ఐహెచ్ వెల్లడించింది.
“Boys gave their all today, we deserve to be in the place we are. Maybe it’s all written” exclaims an ecstatic Men’s team coach, Craig Fulton after yesterday’s win against Great Britain in the Quarterfinals.
Next up for Team India🇮🇳 a Semi-Final test against Germany🇩🇪 tomorrow.… pic.twitter.com/CvBzXHcOzG
— Hockey India (@TheHockeyIndia) August 5, 2024
విశ్వ క్రీడల్లో దుమ్మురేపుతున్ భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి సెమీస్ చేరిన భారత జట్టు ఈసారి గోల్డ్ మెడల్‌పై కన్నేసింది. 44 ఏండ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకాన్ని ముద్దాడేందుకు హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలతో ఉంది. కానీ, అనుభవజ్ఞుడైన డిఫెండర్ అమిత్ సెమీస్ ఆడకపోవడం పెద్ద లోటే.
A historic day for Indian hockey. After 41 years, the men’s team secured a bronze medal at the Tokyo Olympics, beating Germany #HockeyIndia #IndiaKaGame #OnThisDay
.
.
.
.@CMO_Odisha @IndiaSports @Media_SAI@sports_odisha @Limca_Official @CocaCola_Ind pic.twitter.com/vGx17HFsc6— Hockey India (@TheHockeyIndia) August 5, 2024
అయితే.. క్వార్టర్స్‌లో రిఫరీ అమిత్‌కు రెడ్ కార్డ్ ఇచ్చాక పదిమంది తోనే ఆడిన భారత జట్టు.. గోల్ కీపర్ శ్రీజేష్ ప్రతిభతో బ్రిటన్ను కంగుతినిపించింది. షూటౌట్లో 4-2తో గెలుపొంది పసిడి వేటలో మరో అడుగు ముందుకేసింది. కీలకమైన సెమీస్‌లో అమిత్ స్థానంలో ఎవరు ఆడుతారో? చూడాలి.