Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్(Lakshya Sen) చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయాడు. విశ్వ క్రీడల్లో తొలి కాంస్యం గెలుస్తాడనుకుంటే ఈ యువ ఆటగాడు ఊహించని రీతిలో ఓడాడు. కాంస్య పతక పోరులో మలేషియా షట్లర్ లీ జిల్ జియా(Lee Zil Jia) చేతిలో ఓడి కోట్లాదిమందిని నిరాశపరిచాడు.
ఇక రెజ్లింగ్ పోటీల్లో నిషా దహియా (Nisha Dahiya) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 68 కిలోల విభాగంలో టెటియన రిజ్కో(ఉక్రెయిన్)ను 6-4తో ఓడించిన ఈ యువకెరటం పతకం వేటలో అడుగుముందుకు వేసింది.
నిషా దహియా
సోమవారం జరిగిన కంచు పోరులో లక్ష్య సేన్ అలవోకగా తొలి సెట్‌ను గెలిచాడు. ఆ తర్వాత వెనకబడి 21-13, 16-21, 11-21తో పరాజయం పాలై భారమైన గుండెతో కోర్టును వీడాడు.రెండో సెట్లో లీ నుంచి భారత స్టార్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అయితే తన మార్క్ షాట్లతో చెలరేగి ఆధిక్యాన్ని తగ్గించాడు. కానీ, మలేషియా షట్లర్ 21-16తో రెండో సెట్ గెలుపొందాడు.
PROUD OF YOU LAKSHYA 👏
The journey till here wasn’t easy at all. Lakshya’s determination has taken him so far. Some very good wins against seeded opponents to be proud of and lots of positives to take from #Paris2024!
📸: @badmintonphoto#IndiaAtParis24#Badminton pic.twitter.com/2xExEIaCWL
— BAI Media (@BAI_Media) August 5, 2024
దాంతో, మ్యాచ్ మూడో సెట్‌కు వెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో లక్ష్య సేన్ వెనకబడ్డాడు. మోచేతి గాయం కూడా అతడిని ఇబ్బంది పెట్టింది. ఇదే అదనుగా లీ కచ్చితమైన షాట్లతో విరుచుకుపడి కాంస్య పతకాన్ని తన్నుకుపోయాడు. దాంతో, బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధుల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచిన మూడో ప్లేయర్‌గా రికార్డుకెక్కాలనుకున్న లక్ష్య సేన్ కల చెదిరింది.