Dinesh Karthik : భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik)కు మరో గౌరవం దక్కింది. ఇప్పటికే ఐపీఎల్లో ఆర్సీబీ (RCB) బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికైన కార్తిక్ దక్షిణాఫ్రికా 20(SA20) లీగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఎస్ఏ20 మూడో సీజన్లో సఫారీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ (AB de VillIers)తో కలిసి అతడు లీగ్ ప్రచారంలో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని సోమవారం యాజమాన్యం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
‘బెట్‌వే ఎస్ఏ20, దక్షిణాఫ్రికా ప్రీమియర్ టీ20 లీగ్ పోటీలోకి అంబాసిడర్ కార్తిక్ ఘన స్వాగతం. వరల్డ్ కప్ విజేతగా, భారత క్రికెటర్‌గా కార్తిక్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. అతడి రాక మా లీగ్‌లో ఉత్సాహాన్ని నింపనుంది. ఎస్ఏ20 అంబాసిడర్‌గా ఉన్న డివిలియర్స్‌తో కార్తిక్ కలిసి పని చేయనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ లీగ్‌ను మరింత చేరువ చేయనున్నారు’ అని ఎస్ఏ తెలిపింది. కార్తిక్ సైతం కొత్త పాత్రలో ఒదిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు.
Extremely excited to be announced as the Brand Ambassador for #BetwaySA20, Looking forward to the tournament https://t.co/8hRJjCSlbG
— DK (@DineshKarthik) August 5, 2024
‘ఎస్ఏ20లో అంబాసిడర్‌గా వెళ్తున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. గత రెండు సీజన్లుగా దక్షిణాఫ్రికా లీగ్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో అద్భుతంగా సాగింది. ప్రతిభ గల యువ క్రికెటర్లు ప్రపంచ వేదకపై అదరగొడుతున్నారు. ఇది నిజంగా ఓ గౌరవం. ఎస్ఏ20 చీఫ్ గ్రేమ్ స్మిత్, అతడి బృందంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న’ అని కార్తిక్ వివరించాడు.
డివిలియర్స్, కార్తిక్
ఎస్ఏ20 మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న మొదలవ్వనుంది. నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీల్ ఎడెన్ మర్క్రమ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.