Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో 9వ రోజు నిరాశపరిచిన భారత్ షూటర్లు 10 రోజు అదరగొట్టారు. స్కీట్ మిక్స్డ్ టీమ్ విభాగంలో మహేశ్వరి చౌహన్(Maheshwari Chauhan), అనంత్ జీత్ సింగ్ నరుక(Anant Jeet Singh Naruka) జోడీ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది.
సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో 4వ స్థానంలో నిలిచింది. దాంతో విశ్వ క్రీడల్లో దేశానికి నాలుగో మెడల్‌కు అందించాలని ఇద్దరూ పట్టుదలతో ఉన్నారు. కాంస్యం కోసం మహేశ్వరి, అనంత్‌జీత్ జోడీ చైనా జంటతో తలపడనుంది.
ఒలింపిక్స్‌లో మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్‌వీర్ సిద్దూ (Vijayveer Sidhu), అనిష్ భన్వల (Anish Bhanwala)లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇక మహిళల స్కీట్ విభాగంలో మహేశ్వరి చౌహన్ (Maheshwari Chauhan), రైజా ధిల్లాన్ (Raiza Dhillan)లు సైతం పేలవ ప్రదర్శన కనబరిచారు. ఆదివారం నిర్వహించిన 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ పోటీల్లో విజయ్‌వీర్ 9వ స్థానంలో నిలవగా, అనిష్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.