Ponnam Prabhakar | శ్రీశైలం దేవస్థానానికి ఏసీ బస్సు నడిపిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి ప్రతి రోజూ ఒక ఏసీ బస్సును నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పేర్కొన్నారు. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సోమవారం ఆయన దర్శించుకున్నారు.
Ponnam Prabhakar | శ్రీశైలం : హైదరాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి ప్రతి రోజూ ఒక ఏసీ బస్సును నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పేర్కొన్నారు. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామి, అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి మండలం నుంచి జిల్లాకేంద్రానికి ఓ ఏసీ బస్సును నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
అవసరమైతే మండల కేంద్రం నుంచి స్థానికుల అవసరాలుంటే హైదరాబాద్‌కు ఏసీ బస్సును వేయనున్నట్లు తెలిపారు. హామీ ఇచ్చిన విధంగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేశామని.. ప్రస్తుతం రూ.1.50లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. త్వరలోనే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారని.. వారిపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేసుకుంటామని పొన్నం పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

