Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులు అదరగొట్టారు. వ్యక్తిగత ఈవెంట్లో నిరాశపరిచిన మనికా బత్రా (Manika Batra), ఆకుల శ్రీజ(Akula Sreeja), అర్చనా కామత్ (Archana Kamath)లు టీమ్‌గా హిట్ కొట్టారు. పతకం ఆశలు రేపుతూ ఈ త్రయం క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన 16వ రౌండ్లో శ్రీజ, బత్రా, అర్చన బృందం రొమేనియా జట్టును చిత్తు చేసింది.
తొలుత అర్చనా కామత్ రొమేనియా స్టార్ అడినా డియాకొనుకు చెక్ పెట్టింది. అనంతరం శ్రీజ సైతం పట్టుదలగా ఆడి ఎలిజబెట సమరను ఓడించింది. దాంతో, భారత జట్టు 3-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మనికా బత్రా వరుసగా రెండు గేమ్‌లు గెలిచింది.
𝐒𝐮𝐩𝐞𝐫 𝐬𝐥𝐚𝐲𝐞𝐫𝐬 𝐜𝐫𝐞𝐚𝐭𝐞 𝐡𝐢𝐬𝐭𝐨𝐫𝐲 ❤️🇮🇳
Manika Batra, Sreeja Akula, and Archana Kamath clinch a thrilling victory over WR 4️⃣ Romania in their #Paris team debut! 🤩#UTT4India #TeamIndia #UTT #UltimateTableTennis #TableTennis pic.twitter.com/WXpgIlOOFG
— Ultimate Table Tennis (@UltTableTennis) August 5, 2024
అడియాపై 11-5, 11-9, 11-9తో మనికా అదరగొట్టింది. దాంతో, భారత త్రయం క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. శ్రీజ, మనికా, అర్చన టీమ్ సెమీస్ బెర్తు కోసం యూఎస్ఏ లేదా జర్మనీ జట్టుతో తలపడనుంది.