Amazon Great Freedom Festival 2024 | ఇండియన్ యూజర్ల కోసం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ తీసుకొచ్చిన ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ 2024’ ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు ఆరో తేదీ అర్ధరాత్రి.. అంటే సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు మొదలవుతుంది. సాధారణ యూజర్లకు మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి వస్తుంది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, టాబ్లెట్లు తదితర పర్సనల్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది అమెజాన్.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్-2024 కింద డిస్కౌంట్ తోపాటు అదనంగా బ్యాంకు, కూపన్ ఆఫర్లతో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు, ఎస్బీఐ ఖాతాదారులు ఈఎంఐ పేమెంట్స్ ద్వారా స్మార్ట్ ఫోన్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని వస్తువుల పెర్ఫార్మెన్స్ ఆధారంగా వాటి ఎక్స్చేంజ్ ఆఫర్లతోనూ మరింత ధర తగ్గుతుంది.
ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, ఐక్యూ తదితర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హానర్ 200 5జీ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.39,999 పలికితే.. డిస్కౌంట్లతో రూ.29,999లకే సొంతం చేసుకోవచ్చు. రియల్మీ జీటీ 6టీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.30,999 అయితే, డిస్కౌంట్లతో రూ.25,999లకు లభిస్తుంది. అలాగే రియల్ మీ నార్జో ఎన్61 ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499లకు ఆవిష్కరిస్తే ఇప్పుడు రూ.6,999లకు సొంతం చేసుకోవచ్చు.
ఫోన్ పేరు – ఆవిష్కరణ ధర (రూ) – డిస్కౌంట్ ధర (రూ)
ఐ-ఫోన్13 – 79,900 – 47,900
వన్ ప్లస్ 12 ఆర్ – 42,999 – 39,999
ఐక్యూ నియో9 ప్రో – 39,999- 31,999
హానర్ 200- 39,999 – 29,999
వన్ప్లస్ నార్డ్ 4 5జీ – 29,999 – 27,999
రియల్మీ జీటీ 6టీ 5జీ- 30,999 – 25,999
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 2023 – 49,999 – 24,999
వన్ప్లస్ నార్డ్ సీఈ 4 – 24,999 – 21,999
వన్ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ – 19,999 – 16,999
ఐక్యూ జడ్9 5జీ – 19,999 – 16,999
లావా బ్లేజ్ ఎక్స్ – 16,999 – 13,249
ఐక్యూ జడ్9 లైట్ 5జీ – 10,499 – 9,999
రియల్మీ నార్జో ఎన్61 – 8,499 – 6,999