ఇస్లామాబాద్: బాక్సాఫీసునే కాదు.. అన్ని పార్టీల్లోనూ ధురంధర్(Dhurandhar) ఫిల్మ్ సాంగ్స్ ఓ జోష్ క్రియేట్ చేస్తున్నాయి. వాస్తవానికి దాయాది దేశం పాకిస్థాన్ ఆ ఫిల్మ్‌ను బ్యాన్ చేసింది. కానీ ఆ ఫిల్మ్‌లోని పాటలకు మాత్రం అక్కడి పబ్లిక్ ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు. ధురంధర్‌లోని షరారత్ సాంగ్‌కు ఇద్దరు అమ్మాయిలు చిందేశారు. పాకిస్థాన్‌లో జరిగిన ఓ వెడ్డింగ్ వేడుకలో ఇద్దరు అమ్మాయిలు షెరారత్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఆ సాంగ్ ట్రాక్‌కు తగ్గట్లు అమ్మాయిలు స్టెప్పులేశారు. ఆ సమయంలో పెళ్లి వేడుకలో పాల్గొన్న జనం చప్పట్లతో ఎంకరేజ్ చేశారు. కలర్‌ఫుల్ దుస్తులు ధరించిన ఆ అమ్మాయిలు.. పాటకు తగ్గ రీతిలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.
Dance on Dhurandhar Movie Song Shararat at Pakistani Wedding 😍 pic.twitter.com/Utn7kxOGo4
— Rosy (@rose_k01) January 4, 2026
బాలీవడ్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ (Dhurandhar) సృష్టించిన సునామీ ఇంకా ఆగడం లేదు. బాలీవుడ్ చరిత్రలో మరే ఇతర హిందీ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన ఐదో వారంలో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. దీంతో భారతీయ సినీ పరిశ్రమలో ఒక హిందీ సినిమా రూ. 800 కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా ధురంధర్ రికార్డులకెక్కింది.
అలాగే ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్లో ‘పుష్ప 2’ (హిందీ వెర్షన్) అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ‘ధురంధర్’ సాధిస్తున్న వసూళ్ల వేగాన్ని చూస్తుంటే అతి త్వరలోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ బిజినెస్ రికార్డును ధురంధర్ అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో హిందీ బెల్ట్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నంబర్ వన్ చిత్రంగా అవతరించేందుకు ‘ధురంధర్’ కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది.