Bangladesh – Indian Trains | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను సస్పెండ్ చేసినట్లు భారతీయ రైల్వేస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. రిజర్వేషన్ల అమలు కోసం బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతోపాటు ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, పాలనా పగ్గాలను సైన్యానికి అప్పగించడం వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. తొలుత గుర్తు తెలియని ప్రదేశానికి షేక్ హసీనా తరలి వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు వెళ్లే విమాన సర్వీసులను భారతీయ రైల్వే సస్పెండ్ చేయడం గమనార్హం.
బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆఫీసును మూసేస్తున్నట్లు ఎల్ఐసీ సోమవారం ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీ వరకూ బంగ్లాదేశ్ లోని తమ ఆఫీసు మూసేస్తున్నట్లు సోమవారం ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్’లో తెలిపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆగస్టు ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.
Google Pixel 9 | పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లపై గూగుల్ ఆకర్షణీయ ఆఫర్లు.. ఇవీ డీటెయిల్స్..?!
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !