ముంబై: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. జాతీయ స్థాయిలో భారత కూటమిలో భాగమైనప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో భాగం అయ్యేందుకు నిరాకరించింది. (AAP To Contest Maharashtra Polls) ముంబైలోని మొత్తం 36 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించుతామని ఆప్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెల్లడించింది.
కాగా, తమ పార్టీ దశాబ్దం పాటు ఢిల్లీని పరిపాలిస్తోందని, ఢిల్లీ మోడల్ విద్య, ఆరోగ్యం పథకాలతో పట్టణ ప్రాంతాలలో బాగా రాణిస్తోందని ఆప్ ముంబై వర్కింగ్ ప్రెసిడెంట్ రూబెన్ మస్కరెన్హాస్ తెలిపారు. మహారాష్ట్రలోని 27 మున్సిపల్ కార్పొరేషన్లలో ముంబైకి ప్రజాప్రతినిధులు లేరని అన్నారు. ముంబైలో మౌలిక సదుపాయాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. పరిష్కారం కాని సమస్యగా గృహనిర్మాణం మిగిలిపోయిందన్నారు. బిల్డర్, కాంట్రాక్టర్ మాఫియా ముంబై నగరాన్ని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు.