ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 5: కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) ప్ర మోషన్లలో ఉస్మానియా వర్సిటీ (ఓయూ) అధ్యాపకులకు జరిగిన అవకతవకలపై ప్రొఫెసర్లు చేపట్టిన నిరసనలు 98వ రోజుకు చేరా యి. సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో పలువురు ప్రొఫెసర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ విభాగం ఎదు ట నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ మాట్లాడుతూ.. అధ్యాపకుల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించకపోవడం, తాము 3 నెలల నుంచి నిరసన తెలుపుతున్నా కనీసం ఏమైందని అడగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఓయూను అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్తారని సీఎంను ప్రశ్నించారు.