IND vs SL : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో శ్రీలంక(Srilanka) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంకకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. అవిష్క ఫెర్నాండో(54) అర్ధ శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ పథుమ్ నిశాంక(45) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ భారత బౌలర్లను ఒత్తిడికి గురి చేశారు.
సెంచరీ భాగస్వామ్యం దిశగా వెళ్తున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. దాంతో, 89 పరుగుల వద్ద లంక మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత కుశాల్ మెండిస్(7) అండగా ఫెర్నరాండో జట్టుకు భారీ స్కోర్ అందించే పనిలో ఉన్నాడు. 25 ఓవర్లకు లంక స్కోర్.. 107-1.