శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Sep 28, 2020 , 02:30:05

భారతీయుల్లో హాస్యచతురత తక్కువ

భారతీయుల్లో హాస్యచతురత తక్కువ

  • గవాస్కర్‌కు ఫారుఖ్‌ ఇంజినీర్‌ మద్దతు 

ముంబై: భారతీయుల్లో హాస్య చతురత పాలు తక్కువని మాజీ క్రికెటర్‌ ఫారుఖ్‌ ఇంజినీర్‌ అన్నాడు. చాలా మాటల కు పెడార్థాలు తీస్తారని చెప్పుకొచ్చాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మపై వ్యాఖ్యల నేపథ్యంలో సునీల్‌ గవాస్కర్‌కు ఫారుఖ్‌ మద్దతుగా నిలిచాడు. అనుష్కను లక్ష్యంగా చేసుకొని సన్నీ అలా మాట్లాడలేదని, అతని మాటలకు ద్వంద అర్థాలు తీశారని ఇంజినీర్‌ విమర్శించాడు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘భారతీయులుగా మనలో కొంచెం హాస్య చతురత తక్కువ అని చెప్పొచ్చు. కోహ్లీ, అనుష్కపై సన్నీ వేరే ఉద్దేశంతో నిందాపూర్వంగా మాట్లాడలేదు. అతని మాటలకు కొందరు వేరే అర్థాలను వెతికారు. నా విషయంలోనూ ఇలాగే జరిగింది’ అని అన్నాడు.