Sahil Chauhan : అంతర్జాతీయంగా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. కేవలం 27 బంతుల్లోనే మూడంకెల స్కోర్ కొట్టేశాడు. అలాగనీ పొట్టి ప్రపంచకప్‌లో స్టార్ ఆటగాడు ఎవరో ఒకరు ఈ మెరుపు శతకవీరుడు అయి ఉంటారు అనుకుంటే పొరబడినట్టే. ఈ రికార్డు శతకం బాదింది ఎవరంటే పసికూన ఎస్తోనియా(Estonia) జట్టు క్రికెటర్. పేరు.. సహిల్ చౌహన్ (Sahil Chauhan).
సహిల్ విధ్వంసంతో నమీబియా హిట్టర్ పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాన్ నికొల్ లొఫ్టీ (Jan Nicol Loftie) నేపాల్‌పై 33 బంతుల్లోనే వంద కొట్టేసి రికార్డు నెలకొల్పాడు. అయితే.. టీ20ల్లో అసాధ్యమన్నదే లేదని నిరూపిస్తూ.. నాలుగు నెలల వ్యవధిలోనే ఆ రికార్డును సహిల్ బద్ధలు కొట్టేశాడు.
🤩 Fastest Men’s T20I hundred
🔥 Most sixes in a Men’s T20I knockEstonia’s Sahil Chauhan shattered a few records during his innings against Cyprus 💥
Read on ➡️ https://t.co/31502UVMXw pic.twitter.com/Yry1p39eRO
— ICC (@ICC) June 17, 2024
సోమవారం సిప్రస్(Cyprus) జట్టుపై సహిల్ చెలరేగిపోయాడు. 193 పరుగుల ఛేదనలో పూనకం వచ్చినట్టు ఆడిన అతడు మెరుపు సెంచరీ బాదాడు. 41 బంతుల్లోనే 144 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తూ ఏకంగా 351 స్ట్రయిక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయంటే ఏ రేంజ్లో ఊచకోత కోశాడో అర్ధం చేసుకోవచ్చు. దాంతో, ఎస్తోనియా 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.