NZ vs PNG : టీ20 వరల్డ్ కప్లో వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన పోరులో న్యూజిలాండ్ (Newzealand) బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో ఉగాండాపై నిప్పులు చెరిగిన కివీస్ పేసర్లు పపువా న్యూ గినియా(Papua New Guinea)ను వణికించేందుకు సిద్దమయ్యారు.
నామమాత్రమైన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఒక్క మార్పు చేసింది. జేమ్స్ నీషమ్ స్థానంలో పేసర్ టిమ్ సౌథీ (Tim Southee) జట్టులోకి వచ్చాడు. మరోవైపు గినియా జట్టు రెండు మార్పులతో ఆడుతోంది.
న్యూజిలాండ్ జట్టు : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిఫ్స్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
పపువా న్యూ గినియా జట్టు : టోనీ ఉరా, అస్సాద్ వలా(కెప్టెన్), చార్లెస్ అమిని, సెసె బౌ, హిరి హిరి, చాడ్ సోపర్, కిప్లిన్ డొరిగ(వికెట్ కీపర్), నొర్మన్ వనౌ, అలే నవో, కబువ మొరియా, సెమో కమీయ.
ట్రినిడాడ్లో వర్షం కారణంగా షెడ్యూల్ ప్రకారం 7: 30కి వేయాల్సిన టాస్ ఆలస్యమైంది. వాన తగ్గాక ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో గంట తర్వాత టాస్ వేశారు. లీగ్లో చివరి మ్యాచ్ కావడంతో విజయంతో టోర్నీని ముగించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఉగాండాపై సూపర్ విక్టరీ కొట్టిన న్యూజిలాండ్ పసికూన గినియాపై భారీ తేడాతో గెలుస్తుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.