ENGs SL : సుదీర్ఘ ఫార్మాట్ అంటే చాలు పరుగుల వరద పారించే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) శతక గర్జన చేశాడు. తనకెంతో ఇష్టమైన లార్డ్స్ స్టేడియంలో శ్రీలంక(Srilanka) బౌలర్లను ఉతికేస్తూ 33వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా రూట్ రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. ఓవైపు సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. పట్టుదల వీడకుండా ఆడుతున్న రూట్ డ్రింక్స్ బ్రేక్ సమయానికి రూట్ 128 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఫ్యాబ్ – 4 లో ఒకడైన రూట్ తనలో పరుగుల ఆకలి తగ్గలేదని నిరూపించాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరుగునత్న రెండో టెస్టు తొలి రోజే అతడు మూడంకెల స్కోర్ బాదేశాడు. లహిరు కుమార బౌలింగ్‌లో బౌండరీతో రూట్ టెస్టు కెరీర్లో 33వ సెంచరీ నమోదు చేశాడు. దాంతో, 32 సెంచరీలతో ఉన్న స్టీవ్ స్మిత్(Steve Smith), కేన్ విలియమ్సన్(Kane Williamson)లను రూట్ దాటేశాడు.
Joe Root goes level with Alastair Cook on 33 Test hundreds 🤝 #ENGvSL pic.twitter.com/e0PrNuQLkS
— ESPNcricinfo (@ESPNcricinfo) August 29, 2024
ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో చిత్తుగా ఓడిన లంక రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా నమ్మకాన్ని నిలబెడుతూ లహిరు కుమార ఆదిలోనే బ్రేకిచ్చాడు. డేంజరస్ డానియెల్ లారెన్స్(9) ను ఔట్ చేసి లంకకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత మరో 9 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ సారథి ఓలీ పోప్(1)ను అసిథ ఫెర్నాండో బోల్తా కొట్టించాడు.
Most Test runs on English soil:
Joe Root: 6569*
Alastair Cook: 6568England’s greatest 🐐 pic.twitter.com/SrJ5SyRqNP
— ESPNcricinfo (@ESPNcricinfo) August 29, 2024
తొలి సెషన్లో 42కే రెండు వికెట్లు పడిన దశలో ఓపెనర్ బెన్ డకెట్(40)తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్ నిర్మించాడు. జట్టు స్కోర్ 82 వద్ద డకెట్ ఔటైనా ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్()తో మరో భాగస్వామ్యం నెలకొల్పాడు. లంక బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ అర్ధ శతకంతో చెలరేగిన రూట్ ఇంగ్లండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అయితే.. మరోసారి మ్యాజిక్ చేసిన అసిథ డేంజరస్ బ్రూక్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, లంక ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే రూట్ పోరాటం ఆపలేదు. జేమీ స్మిత్(21), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్()లతో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు.