Motorola Razr 50 | ప్రముఖ టెక్నాలజీ సంస్థ లెనెవో (Lenovo) అనుబంధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా రేజర్ 50 (Motorola Razr 50) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. మోటరోలా ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ ఫోన్ 3.6 అంగుళాల ఎక్స్టర్నల్ స్క్రీన్ తో వస్తుందని సంస్థ ధృవీకరించింది. వచ్చేనెల తొమ్మిదో తేదీన భారత్ మార్కెట్లోకి రానున్నది మోటరోలా రేజర్50 ఫోన్. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, కంపెనీ ఈ-స్టోర్ ద్వారా అమ్మకాలు ప్రారంభిస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ కోటింగ్ ప్రొటెక్షన్ తో వస్తున్న ఈ ఫోన్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్ 8 రేటెడ్ పొందింది.
మోటరోలా రేజర్ 50 (Motorola Razr 50) ఫోన్ 3.6 అంగుళాల కవర్ డిస్ ప్లేతోపాటు పొడవైన ఎక్స్ టర్నల్ డస్ ప్లే ఉంటుందని భావిస్తున్నారు. మోటో ఏఐ ఫీచర్లతోపాటు గూగుల్ ఏఐ – జెమినీ ఫీచర్లు కూడా ఉంటాయి. మోటరోలా రేజర్ 50 ఫోన్ 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2640 పిక్సెల్స్) పోలెడ్ ఇన్నర్ డిస్ ప్లే, 3.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1056×1066 పిక్సెల్స్) పోలెడ్ కవర్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎక్స్ చిప్ సెట్ తో పని చేస్తుందీ ఫోన్. 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తోంది.
మోటరోలా రేజర్ 50 డ్యుయల్ ఔటర్ కెమెరాలో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 13- మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఇన్నర్ డిస్ ప్లేలో 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కెమెరాతో వస్తోంది. 30వాట్ల వైర్డ్, 15వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటది. మోటరోలా రేజర్ 50 ఫోన్ సుమారు రూ.47 వేలు (3699 చైనా యువాన్లు) పలుకుతుంది.
Apple – Jobs | ఉద్యోగార్థులకు ఆపిల్ ఆఫర్.. ఏడు నెలల్లో ఆరు లక్షల కొలువులు