కొలంబో: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ముందు శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్‌కు తొలి వన్డేలో షాక్ తగిలింది. ఇరుజట్ల మధ్య కొలంబో వేదికగా గురువారం ముగిసిన తొలి వన్డేలో లంక 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 50 ఓవర్లకు 271/6 స్కోరు చేశారు. కుశాల్ మెండిస్ (93), జనిత్ (46) రాణించారు. ఛేదనలో ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 252 రన్స్ వద్దే ఆగిపోయింది. డకెట్ (62), రూట్ (61) పోరాడారు.