T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. ఇంగ్లండ్ (England) ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ తేదీలను సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెల్లడించింది. వచ్చే ఏడాది జూన్ 12న మెగా టోర్నీ మొదలవుతుందని.. జూలై 5న ముగుస్తుందని తెలిపింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుండగా.. ఓవల్ మైదానంలో సెమీ ఫైనల్స్ నిర్వహించనున్నారు. జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్ పోరు ఉండనుంది.
ప్రస్తుతానికి పొట్టి ప్రపంచ కప్ పోటీలకు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆతిథ్య ఇంగ్లండ్ అర్హత సాధించాయి. మరో నాలుగు బెర్తులు టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2025 మ్యాచ్‌ల ఆధారంగా ఖరారు అవుతాయి. తో పాటు ఐదు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
Mark your calendars 🗓
The dates and venues for key fixtures in the ICC Women’s T20 World Cup 2026 have been revealed ⌛
Here’s how to register your interest ➡ https://t.co/OQnVXyJbwN pic.twitter.com/7gtoUmGquv
— ICC (@ICC) June 2, 2025
జూన్ 30న తొలి సెమీస్, జూలై 2న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లు ఓవల్‌లో ఆడిస్తారు. అనంతరం ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జూలై 5న టైటిల్ పోరు జరుగనుంది. నిరుడు విజేతగా నిలిచిన న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది.
1 జూన్ 12, 2026 – వరల్డ్ కప్ పోటీల ఆరంభం, ఎడ్జ్‌బాస్టన్‌లో.
2. జూన్ 30, 2026 – తొలి సెమీ ఫైనల్, ఓవల్ మైదానంలో.
3. జూలై 2, 2026 – రెండో సెమీ ఫైనల్, ఓవల్ మైదానంలో.
4. జూలై 5, 2026 – ఫైనల్, లార్డ్స్.