వ్యవసాయ యూనివర్సిటీ : విత్తనానికి( Seed ) దిగులు చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (University VC ) డాక్టర్ అల్దాస్ జానయ్య (Dr. Janaiah) అన్నారు. సోమవారం విశ్వవిద్యాలయం కళాశాల ఆవరణలో నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు . రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13 లోపు దాదాపు 11వేల గ్రామాల్లోని రైతులకు మూల విత్తనాన్ని అందజేస్తామన్నారు.
రైతులకు ఆర్థికంగా సహాయమే కాకుండా సరైన సమయంలో సరైన సలహాలు, సంపదను పెంచుకోవచ్చని సూచించారు. వచ్చే రబీకి రైతులే పంటను కోసి నాణ్యత గల విత్తనాన్ని అందుబాటులో ఉంచుకోవచ్చని తెలిపారు. విత్తనానికి దిగులు చెందవద్దని తమ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ అధికారుల వద్ద విత్తనం అందుబాటులో ఉంటుందని వివరించారు.
ప్రధానంగా పెసర, మినుము, వేరుశనగ విత్తనాలు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి సేకరించుకోవాలని అన్నారు. పంట సాగులో నాణ్యమైన విత్తనం ప్రాధాన్యతను గుర్తించి జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఈ ఏడాది నాణ్యమైన విత్తనం రైతుకు నేస్తమానే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. విత్తనాలను ఎరువులను కొనుగోలు చేసిన వద్ద తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని , నాణ్యత లేని చోట రైతుకు అనుమానం వస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందజేయాలని కోరారు.