French Open : ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో సంచలనం నమోదైంది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి చేతిలో టాప్ సీడ్ జెస్సికా పెగులా(Jessica Pegula) మట్టికరిచింది. నిరుడు యూఎస్ ఓపెన్ రన్నరప్ అయిన పెగులా.. మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన లియోస్ బైసన్(Lois Boisson) ధాటికి తలవంచింది. తొలి సెట్ కోల్పోయినా సరే ఒత్తిడికి లోనవ్వకుండా ఆడిన 21 ఏళ్ల బైసన్.. వరుస సెట్లలో జోరు చూపించిమ్యాచ్ గెలుచుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఆమె అమెరికా టీనేజర్ కొకొ గాఫ్‌ను ఎదుర్కోనుంది.
సోమవారం జరిగిన ప్రీ – క్వార్టర్స్‌లో బైసన్ ఛాంపియన్ తరహాలో చెలరేగింది. మూడో సీడ్ జెస్సికాకు ముచ్చెమటలు పట్టించిందీ ఫ్రాన్స్ బ్యూటీ. తొలి సెట్‌ను 3-6తో కోల్పోయిన తను.. రెండో సెట్లో పుంజుకుంది. పెగులా బలమైన సర్వ్‌లతో విరుచుకుపడినా.. బైసన్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలగా ఆడిన తను 6-4తో సెట్ గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ అదిరే ప్రదర్శన కనబరిచి 6-4తో విజయం సాధించిందీ యంగ్‌స్టర్. టాప్ సీడ్‌కు షాకిచ్చిన ఆమెకు క్వార్టర్స్‌లో కొకొ గాఫ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురుపడనుంది.
An upset for the ages 😮
World No.361 Lois Boisson stunned No.3 seed Jessica Pegula to book a place in the quarter-finals. Watch the highlights here. #RolandGarros pic.twitter.com/IlCgStO1XC
— Roland-Garros (@rolandgarros) June 2, 2025
‘టాప్ సీడ్‌పై గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో నాకు ఏం చెప్పాలో కూడా తోచడం లేదు. నాపై మీరు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు. మట్టి కోర్టులో సొంత ప్రేక్షకుల సమక్షంలో ఆడడం నిజంగా గొప్ప అనుభూతి. నేను గెలవాలనే కసితోనే ఆడాను’ అని బైసన్ తెలిపింది. ప్రస్తుతం ఫ్రాన్స్ నుంచి టైటిల్ వేటలో ఉన్న ఏకైక ప్లేయర్ తనే కావడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో నంబర్ 3 అలెగ్జాండర్ జ్వెరెవ్ ముందంజ వేశాడు. నిరుడు రన్నరప్ అయిన అతడు టలాన్ గ్రియెస్క్పూర్పై ఆధిక్యంతో టైటిల్ దిశగా సాగుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కారాజ్ తదుపరి రౌండ్లో 12వ సీడ్ టామీ ఫాల్ (అమెరికా)తో తలపడనున్నాడు.