IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఛాంపియన్ ఎవరో రేపటితో తేలిపోనుంది. క్వాలిఫయర్ 1లో తలపడిన రాయల్ ఛాలెంజర్స్(RCB), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్లు టైటిల్ కోసం కాచుకొని ఉన్నాయి. తొలిసారి ట్రోఫీని ముద్దాడి మురిసిపోవాలని రెండు ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఇది నాలుగో ఫైనల్. ఈసారైనా అతడు తన కలను సాకారం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంల్ రజత్ పాటిదార్ (Rajat Patidar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఫైనల్ పోరుకు సన్నాహకాల్లో ఉన్న బెంగళూరు టైటిల్‌తో విరాట్‌కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలని అనుకుంటుందిన చెప్పాడీ స్కిప్పర్. ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్‌తో ప్రతిసారి ఐపీఎల్ బరిలో నిలిచే ఆర్సీబీ.. ఈసారి టైటిల్‌కు మరింత చేరువైంది. దాంతో, విరాట్ ఐపీఎల్ ట్రోఫీని అందుకుంటే చూసి తరించాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదే విషయమై రజత్ పాటిదార్ తన అభిప్రాయం వెలిబుచ్చాడు.
‘ఆర్సీబీ కోసం విరాట్ కోహ్లీ ఎంతో చేశాడు. సీజన్ ఆరంభం నుంచి అతడు బెంగళూరుతోనే కొనసాగుతున్నాడు. అందుకే.. అతడికి బహుమతిగా ట్రోఫీ ఇవ్వాలనుకుంటున్నాం. ఫైనల్లో మేము అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే ఛాంపియన్లుగా అవతరించడం ఖాయం.
The path was tough. The purpose was clear ❤
Here’s how #RCB battled their way to the #TATAIPL 2025 Grand Final 🏆#RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets pic.twitter.com/kFgAajj2ta
— IndianPremierLeague (@IPL) June 2, 2025
అయితే.. ఫైనల్లో ఆడుతున్నామనే ఒత్తిడి మాపై లేదు. మేము మా బెస్ట్ క్రికెట్ ఆడాలని అనకుంటున్నాం. కోహ్లీ ఉండడంతో మా జట్టుపై అందరికి అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు మాకు మద్దతుగా నిలుస్తుండడంతో మేము ఏ మైదానంలో ఆడుతున్నా.. అదే మాకు సొంత మైదానం అనిపిస్తోంది’ అని ఆర్సీబీ సారథి వెల్లడించాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌కు హిట్టర్ టిమ్ డేవిడ్ (Tim David) అందుబాటులో ఉంటాడా? అనే విషయమై స్పందిస్తూ.. సాయంత్రం కల్లా సమాచారం వస్తుందని చెప్పాడు రజత్. తొడ కండరాల గాయంతో బాధ పడుతున్న డేవిడ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
Collectively firing! 🔥
Here’s 𝑴𝒐 on that aspect of our season from our Bossman. 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/hbRynQWf8e
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 1, 2025
మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్‌ను ఆర్సీబీ ఢీ కొట్టనుంది. లీగ్ దశలో ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలిచాయి. అయితే.. క్వాలిఫయర్ 1లో పంజాబ్‌ను బెంగళూరు చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంతకుముందు మూడుసార్లు ఫైనల్ చేరినా ఆర్సీబీ ఓటమితో వెనక్కి వచ్చేసింది. 2009, 2011,2016లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆర్సీబీ.. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ప్లే ఆఫ్స్ దశ దాటలేదు. ఇక పంజాబ్ విషయానికొస్తే.. వాళ్లకు ఇది రెండో ఫైనల్. దాంతో.. తొలి కప్‌ను ఒడిసిపట్టేది ఎవరు? అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.