నకిరేకల్, జూన్ 02 : చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ పోరాటం అగ్నికణంగా ఎగిసిపడిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగి కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించారన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపితే, సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
ఆవిర్భావ దినోత్సవంగా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని.. మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ హయాంలో విధ్వంసం, విద్వేషాలు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చీకటి ఒప్పందాలతో రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తున్నారని, అది ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, నగేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, కౌన్సిలర్ పల్లె విజయ్, నాయకులు పెండెమ్ సదానందం, సామ శ్రీనివాస్ రెడ్డి, రావిరాల మల్లయ్య, గుండ గోని జంగయ్య, వెంకట్‌రెడ్డి, దైద పరమేశం, సత్యనారాయణ, జనార్ధన్, అశోక్ పాల్గొన్నారు.