భోపాల్: హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైన నూతన జంట కేసులో పురోగతి కనిపించింది. (Honeymoon Couple) వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయన భార్య ఆచూకీ ఇంకా తెలియలేదని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వ్యాపార కుటుంబానికి చెందిన రాజ రఘువంశీ, సోనమ్‌కు మే 11న పెళ్లి జరిగింది. కొత్త జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. అయితే మే 23న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు. నాటి నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఆ జంట కోసం వెతుకుతున్నారు.
కాగా, మేఘాలయ పోలీసులు రాజ రఘువంశీ మృతదేహాన్ని సోమవారం లోయలో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఇండోర్ పోలీస్ అధికారి రాజేష్ కుమార్ త్రిపాఠి తెలిపారు. అతడి సోదరుడు మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత రఘువంశీ మరణానికి సంబంధించిన ఇతర వివరాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఆ వ్యక్తి భార్య సోనమ్ గురించి ఇంకా తెలియలేదని వెల్లడించారు.
Also Read: