NEET PG 2025 | నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ (NEET-PG)ని వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష నిర్వహించనుండగా.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే మళ్లీ నీట్ పరీక్ష తేదీని ప్రకటించనునట్లు వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు, పరీక్ష ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ఒకే షిఫ్ట్‌లో పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎన్బీఈ చేసిన వాదనలు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read Also : Delhi bar council | ఆమెను వెంటనే విడుదల చేయండి.. ఢిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్
కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్బీఈ నీట్‌ని రద్దు చేసింది. పరీక్ష కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి నిర్వహించే పరీక్ష. నీట్ ద్వారానే దేశవ్యాప్తంగా అనేక వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షను ఎన్బీఈ నిర్వహిస్తూ వస్తున్నది. 2024లో నీట్ పీజీ రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ రెండు షిఫ్ట్‌లలో వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉండడంతో ఒక షిఫ్ట్‌లోని ప్రశ్నలు సులభంగా, మరొక షిఫ్ట్‌లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆదేశించింది.