IPL 2025 : ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ ఎవరనేది? రేపటితో తేలియనుంది. ఫైనలోనూ అత్యుత్తమ ఆటతో కప్‌ను కొల్లగొటేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(Punjab Kings) సిద్ధమయ్యాయి. లీగ్ ఆసాంతం అదరగొట్టిన రెండు జట్ల మధ్య టైటిల్ పోరు నువ్వా నేనా అన్నట్టు సాగనుంది. ఇద్దరిలో ఎవరు గెలిచిన చరిత్ర సృష్టించినట్టే. కొత్త ఛాంపియన్ ఆవిర్భవించినట్టే.
ఆనవాయితీ ప్రకారం బిగ్ ఫైట్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోషూట్ చేశారు. నరేంద్ర మోడీ స్టేడియంలో సోమవారం సాయంత్రం శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్ ఐపీఎల్ ట్రోఫీతో కెమెరాలకు ఫోజిచ్చారు. ఈ సందర్భంగా ఇరువరు ఆ ట్రోఫీని ఎంతో మురిపెంగా చూస్తూ.. ఎలాగైనా ఈసారి తమ వశం చేసుకోవాలనే సంకల్పంతో కనిపించారు. అనంతరం ఇద్దరూ ప్రీ- మ్యాచ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Captain’s Photoshoot – ✅😎
Pre-match Press Conference – ✅🎙
All eyes 👀 on #TATAIPL Final tomorrow ⌛#RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/tGdWKbZUhp
— IndianPremierLeague (@IPL) June 2, 2025
పద్దినిమిదో సీజన్ ఐపీఎల్ చివరి మ్యాచ్ రేపే. లక్ష మంది సామర్ధ్యం కలిగిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, పంజాబ్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా కనిపిస్తున్న వీటిలో ఆఖరి మురిపెం ఎవరిదనేది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే.. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్.. ముంబైపై సింహ గర్జన చేసింది.
What it means to reach the 𝗙𝗜𝗡𝗔𝗟! ❤️
𝙍𝘼𝙒 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 from the #PBKS camp after a magnificent win in Ahmedabad 🤩#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL pic.twitter.com/p0gXuPZLQL
— IndianPremierLeague (@IPL) June 1, 2025
క్వాలిఫయర్ 2లో మొదట బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్(44), తిలక్ వర్మ(44) మెరుపులతో పాండ్యా సేన 203 రన్స్ చేసింది. భారీ ఛేదనలో ఓపెనర్లు శుభారంభం ఇవ్వగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (87 నాటౌట్) చెలరేగాడు. బుమ్రా ఓవర్లో బౌండరీలతో రెచ్చిపోయిన అయ్యర్.. అర్ధ శతకంతో ముంబై ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లగా.. 204 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు ఉండగానే ఊదిపడేసింది పంజాబ్.