England : హెడింగ్లే టెస్టులో బౌలింగ్ యూనిట్‌గా తేలిపోయిన ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్. ప్రధాన పేసర్లు లేకుండానే భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న స్టోక్స్ సేన.. మార్క్ వుడ్ (Mark Wood) సేవల్ని ఉపయోగించుకోనుంది. మోకాలి గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న వుడ్ త్వరలోనే ఫిట్నెస్ సాధించనున్నాడు. బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టిన అతడు జూన్ 31న జరుగబోయే ఆఖరి టెస్టులోపు జట్టుతో కలుస్తాడని టాక్.
ఈ విషయంపై శనివారం స్పందించిన ఈ స్పీడ్‌స్టర్ చివరి టెస్టు ప్రారంభం వరకూ తాను ఫిట్నెస్ సాధించే అవకాశముందని తెలిపాడు. రిహాబిలిటేషన్ అద్భుతంగా సాగుతోంది. నెమ్మది నెమ్మదిగా బౌలింగ్ సాధన చేస్తున్నాను. మరో రెండు వారాల్లో నేను బౌలింగ్ లయ అందుకుంటా. అంటే.. నేను ట్రాక్‌లో పడుతున్నట్టే అని వుడ్ వెల్లడించాడు.
Mark Wood is hoping he can be fit in time for the final Test of the series against India 🤞
Read more: https://t.co/sV6GPPTAV0 pic.twitter.com/rkjflAJBwo
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2025
ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో వుడ్ గాయపడ్డాడు. మోకాలికి తీవ్ర గాయం కావడంతో కుంటుతూ మైదానం వీడాడు. మార్చిలో సర్జరీ చేయించుకున్న ఈ పేసర్ నాలుగు నెలల పాటు రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. నిపుణుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్న ఈ స్పీడ్‌స్టర్ భారత్‌తో చివరి టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. అయితే.. అప్పటివరకూ టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉండేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
శుభ్‌మన్ గిల్(127 నాటౌట్), జైస్వాల్(101)
ఎందుకంటే.. హెడింగ్లేలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(101), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(127 నాటౌట్) సెంచరీలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రిషభ్ పంత్ (65 నాటౌట్) అర్ధ శతకంతో విజృంభించగా తొలి రోజే 359 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు కూడా గిల్, పంత్ జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగులేనట్టే.