IND vs ENG : భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన ఓలీ పోప్(1).. జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే(18) పరుగులతో ఆడుతున్నాడు. 15 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్.. 58/2
అంతకుముందు డేంజరస్ ఓపెనర్ బెన్ డకెట్(35) ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. డకెట్ రీవ్యూ తీసకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో, 55 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ సేన మొదటి వికెట్ పడింది.
Ashwin gets the first wicket for India with Duckett lbw for 35 #INDvENG
▶️ https://t.co/ScJisUw7M1 pic.twitter.com/9umocvom5y
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2024
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో డకెట్, క్రాలే రెచ్చిపోయారు. బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌లో డకెట్ మరింత దూకుడుగా ఆడాడు. ఏకంగా ఏడు బౌండరీలతో బాజ్‌బాల్ ఆటను గుర్తుచేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ రోహిత్.. అశ్విన్‌కు బంతి అందించాడు. తొలి ఓవర్లోనే వికెట్ తీసేలా కినిపంచిన అశ్విన్ రెండో ఓవర్లో డకెట్‌ను ఔట్ చేసిన భారత శిబిరంలో జోష్ నింపాడు.